Today TrendingVishwam Newsతాజా వార్తలుహైదరాబాద్

కృష్ణా జలాల దోపిడీపై బీఆర్ఎస్ జల ఉద్యమం

విశ్వం న్యూస్, హైదరాబాద్, 23 నవంబర్ 2026 : తెలంగాణకు చెందిన కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తరలించకుండా అడ్డుకోవాలని బీఆర్ఎస్ మరో జల ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. పల్నాడు వాటర్ గ్రిడ్ పేరుతో నాగార్జున సాగర్ నుంచి 493 అడుగుల లోతు నుంచే నీటిని తోడుకునే ప్రయత్నం జరుగుతోందని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ ఆరోపించారు. మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB)కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా శ్రవణ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో విఫలమయ్యారని విమర్శించారు. హైదరాబాద్‌లో తాగునీటి సమస్యతో పాటు లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పల్నాడు ప్రాజెక్టును అడ్డుకోవాలని, లేదంటే ప్రజా ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నల్లగొండ సభతో పాటు హైదరాబాద్‌లో కాంగ్రెస్ నేతలను ప్రజల తరఫున నిలదీస్తామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *