మూగబోయిన ఉద్యమ గళం

- ( ప్రజాగాయకుడు ప్రజా యుద్ధనౌక గద్దర్ (గుమ్మడి విఠల్ రావు) మృతికి నివాళి)
హైదరాబాద్, ఆగస్టు 6 (విశ్వం న్యూస్) : మూగబోయిన విప్లవ సామాజిక స్వరం తొలి మలి తెలంగాణ ఉద్యమ గొంతుక మూగబోయింది
సమరశీల నినాదం దివికేగింది
జననాట్య మండలి ద్వారా కాళ్ళకు గజ్జెలు కట్టి గోచి గొంగడితో పల్లెల్లో జరిగిన అకృత్యాలను భూస్వాముల దోపిడీ పీడనకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడు గద్ధర్
పొడుస్తున్న పొద్దు మీద పాట పాడి
తెలంగాణ ఉద్యమానికి ఊపుతెచ్చిన
పాట దివికి పయనమైంది
నాడు తెలంగాణ పోరాట రణ నినాధమై
నేడు ప్రజాస్వామ్య తెలంగాణ సాధన నినాదమై తెలంగాణ ప్రజా ఫ్రంట్ పార్టీ
సారథియై తాడిత పీడిత జన గొంతుకై
దళిత బహుజన ఉద్యమ పాటవై
సామాజిక సమస్యలు అసమానతలకు
వ్యతిరేకంగా పోరాటానికి బుర్రకథ జానపద కళతో చైతన్యాన్ని కలిగించిన చైతన్య దీప్తి ఆరిపోయింది
కుల వివక్ష అంటరానితనం అంతానికి
అలుపెరుగని పాటల పోరాట ప్రజా యుధ్ధ నౌక నడిచే ఉద్యమ గీతిక మూగపోయింది
పేదల పాట్లు విద్యార్థుల రైతన్న ఆత్మహత్యల నివారణకు నీ పాటతో దైర్యం కలిగించిన తీరు
సమాజం మరిచిపోధు
బండెనుక బండి కట్టి జై.బోలే తెలంగాణ అమ్మ తెలంగాణ మా ఆకలికేకల గానామా. . ఆపురో రిక్షా
భద్రం కొడుకో ప్రకృతి సహజవనరుల రక్షణ మీద మదనా సుందరి నీపాధంపై పుట్టు మచ్చనై చెల్లెమ్మా అంటూ పాడిన పాటలతోగద్దర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు
పీడిత తాడిత బహుజన హక్కుల
రక్షణ పోరాట సభల్లో నీ పాట నీ ఆటతో అందరినీ ఆకట్టుకున్నావు
నీ పాట మాట ఆట యువతకు ఉత్తేజ కెరటం కావాలి
నీ పాట తెలంగాణ ప్రగతికి బాట ఉద్యమ ఆశయాల సాధనకు ఊతం
విప్లవ వీరుడవై ఉద్యమస్ఫూర్తివై
చైతన్య శీల ప్రభంజనమై
అట్టడుగు వర్గాల వివక్ష అన్యాయాన్ని ఎదిరించిన చైతన్య శక్తివై
పాటతో ప్రజాఉద్యమ ప్రదాతవై
ఆట పాటలతో అందరి వాడివై
ప్రజాగాయకుడివై ప్రజాయుధ్ధనౌకవై కానరాని లోకాని కెల్లావు
“అమ్మ తెలంగాణ మల్లేతీగకు పందిరి వోలే పొడుస్తున్న పొద్దు మీద అన్న పాటలు పాడి తెలంగాణ స్ఫూర్తి
రగిలించిన నీ మధుర గొంతు మూగబోయింది
బానిసత్వం నుండి బతుకు హక్కుల రక్షణ ఉద్యమంలో నీవు చూపిన తెగువ యువతకు మార్గదర్శియై
నీ గాన స్ఫూర్తితో యువత ప్రజాస్వామిక తెలంగాణ సాధనకు ఉద్యమించడమే నిజమైన నివాళి
(నేదునూరి కనకయ్య)
తెలంగాణ ఎకనామిక్ ఫోరమ్-అధ్యక్షులు