గద్దర్ మరణం తీరని లోటు

గద్దర్ మరణం తీరని లోటు

  • బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాటం చేసిన యుద్ధ నౌక గద్దర్
  • ఇందిరా చౌక్ వద్ద నగర కాంగ్రెస్ ఘన నివాళి
  • నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

కరీంనగర్, ఆగస్టు 6 (విశ్వం న్యూస్) : తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాటలు ఉర్రూతలూగించాయని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కలలుగన్నారని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్ వద్ద గద్దర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం తన గొంతుకతో యుద్ధ నౌక అయ్యారని ఆయన కృషి మరువలేనిదని అన్నారు.

పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అనే పాట తెలంగాణ ఉద్యమంలో ఉర్రూతలూగించిందని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆయన కోరుకున్నారని వారి కోరిక నెరవేరక ముందే మరణించడం బాధాకరం అని నరేందర్ రెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమంలో గుండాటి శ్రీనివాస్ రెడ్డి, గడ్డం విలాస్ రెడ్డి, దన్న సింగ్, షబానా మహమ్మద్, కుర్ర పోచయ్య, ఎండి చాంద్, పొరాండ్ల రమేష్, సలేమొద్దిన్, మెతుకు కాంతయ్య, అన్నే జ్యోతి రెడ్డి, నెల్లి నరేష్, కంకణాల అనిల్ కుమార్, మహమ్మద్ భారీ, బషీర్, ఇమామ్, సయ్యద్ ఖలీల్, హనీఫ్, ముల్కల యోనా, మామిడి సత్యనారాయణ రెడ్డి, దామోదర్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *