కలెక్టర్ ఆఫీస్ ను ప్రారంభించిన కేరళ సీఎం పినరయి విజయ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
హైదరాబాద్, జనవరి 18 (విశ్వం న్యూస్) : ఖమ్మం సమీకృత కలెక్టరేట్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో పాటు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ నేత డి.రాజా ప్రారంభోత్సవం చేశారు.
నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ గురించి జాతీయ నేతలకు సీఎం కేసీఆర్ వివరించారు. పరిపాలనా సౌలభ్యం, ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో నూతన కలెక్టరేట్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత కలెక్టరేట్ శిలాఫలకాన్ని ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాలు, సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత చాంబర్‌లో కలెక్టర్ వీపీ గౌతమ్‌ను సీటులో కూర్చుండబెట్టిన సీఎం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌లో ఫొటో ఎగ్జిబిషన్‌ను జాతీయ నేతలు తిలకించారు.
నలుగురు ముఖ్యమంత్రుల సమక్షంలో బాద్యతల స్వీకరించిన ఖమ్మం కలెక్టర్ గౌతమ్ అదృష్టవంతుడు
ఖమ్మం వైరా ప్రధాన రహదారి వీ వెంకటాయపాలెం వద్ద తెలంగాణ సర్కారు కొత్తగా సమీకృత కలెక్టరేట్‌ను నిర్మించింది. 1000 అడుగుల ఫేసింగ్, 1100 పొడవు ఉండేలా ఈ కలెక్టరేట్‌ను రూ.53 కోట్ల వ్యయంతో నిర్మించారు. అన్ని వసతులతో అత్యంత సౌకర్యవంతంగా ఖమ్మం సమీకృత కలెక్టరేట్ సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నది.
యాదాద్రి నుంచి హెలీకాప్టర్లలో ఖమ్మం చేరుకున్న ముఖ్యమంత్రులు, జాతీయ నేతలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. వారంతా నేరుగా ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.
భట్టి విక్రమార్కను ప్రత్యేకంగా కేజ్రీవాల్ కు పరిషయం చేస్తూ..హగ్ చేసుకున్న కేసీఆర్