అత్తాపూర్ లక్ష్మీ నగర్ కాలనీలో ఘనంగా
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

హైదరాబాద్, ఆగస్టు 15 (విశ్వం న్యూస్) : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్తాపూర్ లక్ష్మీ నగర్ కాలనీలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాలనీలో మొదటి సారి జెండా ఎగురవేయడం పట్ల అందరూ సంతోషం వ్యక్తం చేశారు. కాలనీ పార్క్‌లో ఏర్పాటు చేసి.. వివిధ శాఖల అధికారులు, స్థానిక కార్పోరేటర్ ఆధ్వర్యంలో ఈ వేడుక నిర్వహించడం పట్ల అసోసియేషన్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

అనంతరం శ్రీచైతన్య పాఠశాల విద్యార్థులు, స్థానిక కార్పోరేట్ డిప్యూటీ కమిషనర్, ఏఈ అధికారుల సమక్షంలో మొక్కలు నాటారు. విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పోరేటర్ సంగీతా గౌరీశంకర్, డిప్యూటీ కమిషనర్ రవికుమార్, ఏఈ లక్ష్మి నరసింహమూర్తి యాదవ్, కాలనీ సెక్రటరి సీతారామస్వామి, వైస్ ప్రెసిడెంట్ భాస్కర్, ట్రెజరర్ కె. ముర్తి, ఆర్గనైజింగ్ సెక్రటరి మాటేటి ప్రభాకర్, నవీన్‌కుమార్, డాక్టర్ సీతారామస్వామి, భానుమతి, సుధాకర్ గౌడ్, మహేందర్, ప్రభాకర్, సంతోష్ మరియు కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.