అత్తాపూర్​లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

అత్తాపూర్​ లక్ష్మీ నగర్ కాలనీలో ఘనంగా
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

హైదరాబాద్, ఆగస్టు 15 (విశ్వం న్యూస్) : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్తాపూర్​ లక్ష్మీ నగర్ కాలనీలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాలనీలో మొదటి సారి జెండా ఎగురవేయడం పట్ల అందరూ సంతోషం వ్యక్తం చేశారు. కాలనీ పార్క్​లో ఏర్పాటు చేసి.. వివిధ శాఖల అధికారులు, స్థానిక కార్పోరేటర్​ ఆధ్వర్యంలో ఈ వేడుక నిర్వహించడం పట్ల అసోసియేషన్​ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

అనంతరం శ్రీచైతన్య పాఠశాల విద్యార్థులు, స్థానిక కార్పోరేట్​ డిప్యూటీ కమిషనర్​, ఏఈ అధికారుల సమక్షంలో మొక్కలు నాటారు. విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పోరేటర్​ సంగీతా గౌరీశంకర్​, డిప్యూటీ కమిషనర్​ రవికుమార్​, ఏఈ లక్ష్మి నరసింహమూర్తి యాదవ్​, కాలనీ సెక్రటరి సీతారామస్వామి, వైస్​ ప్రెసిడెంట్​ భాస్కర్​, ట్రెజరర్​ కె. ముర్తి, ఆర్గనైజింగ్​ సెక్రటరి మాటేటి ప్రభాకర్​, నవీన్​కుమార్​, డాక్టర్​ సీతారామస్వామి, భానుమతి, సుధాకర్​ గౌడ్​, మహేందర్​, ప్రభాకర్​, సంతోష్​ మరియు కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *