ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

బండ్లగూడ జాగిర్, (విశ్వం న్యూస్) : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఒకటో వార్డులో సంఘమిత్ర పాఠశాలలో చిన్నారులు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలో చిన్నారులు ఉట్టిని పలగొట్టి ఆకట్టుకున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు పూలపల్లి కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు తలారి ప్రేమ్ కుమార్, భోగాల శ్రీనివాస్, ముఖ్యఅతిథిగా స్థానిక కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్, మదర్, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.