తక్కువ ఖర్చుతో అరుదైన వైద్యం

- అందించిన జమ్మికుంట ఆదిత్య మల్టీస్పెషల్టి హాస్పిటల్
జమ్మికుంట, సెప్టెంబర్ 16 (విశ్వం న్యూస్): జమ్మికుంట పట్టణంలోని ఆదిత్యం మల్టీస్పెషల్టి హాస్పిటల్ నందు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుతో అందించి వారి సేవభావాన్ని చాటుకున్నారు, వివరాల్లోకి వెళితే తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్న ఒక మహిళ కడుపులో పెద్ద కణితి ఉన్నదని నిర్ధారించుకుని ఆపరేషన్ చేయించుకొనుటకు ఆర్థిక స్తోమత లేని పరిస్థితులలో పట్టణంలోని ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులైనటువంటి డాక్టర్ వి కార్తీక్ రెడ్డిని కలవగా స్పందించిన కార్తీక్ రెడ్డి డాక్టర్ ఆమని రెడ్డి ఆధ్వర్యంలో అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్ నిర్వహించి ఆ బాధితురాలు కడుపులో నుండి రెండు కిలోల బరువుగల కణితిని తొలగించగా ఆ మహిళ కుటుంబ సభ్యులు డాక్టర్ కార్తీక్ రెడ్డి, డాక్టర్ ఆమని రెడ్డి, ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ కట్కూరి దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయి శస్త్ర చికిత్సలు అతి తక్కువఖర్చు తో నిర్వహించుటకు ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు..