మరో 3 రోజులు ఈడీ కస్టడీ పొడిగించిన కోర్టు..

హైదరాబాద్, మార్చి 23 (విశ్వం న్యూస్) : కవితకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కా మ్ కేసులో కవిత ఈడీ కస్టడీ రిమాండ్ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా.. కవితను మార్చి 26 వరకు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వుత్తలు జారీ చేశారు. కవితను మార్చి 26 న ఉదయం 11 గంటలకు కోర్టు ఎదుట హాజరుపరచాలని ఈడీని ఆదేశిం చారు.

ఢిల్లీ లిక్కర్ స్కా మ్ కేసులో కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తొలుత ఆమెను 10 రోజుల కస్టడీస్ట కోసం ఈడీ అధికారులు కోరగా.. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు వారం రోజుల కస్టడీకి అనుమతించింది.

ఈ సందర్భం గా కవితకు 5 రోజుల రిమాండ్ ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేక్టట్ కోరింది. ఈ కేసులో తదుపరి విచారణ నిమిత్తం కవితకు కస్టడీ అవసరమని ఈడీ పేర్కొం ది. అయితే రౌజ్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా మాత్రం కవితను మూడు రోజుల కస్టడీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కవితను మార్చి 26న ఉదయం 11 గంటలకు హాజరుపరచాలని ఈడీని ఆదేశిం చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *