సమస్యల పరిష్కారానికి
మంత్రులతో ఒక కమిటీ

- 1.45 గంటల పాటు సాగిన ముఖ్యమంత్రుల సమావేశం
హైదరాబాద్, జూలై 6 (విశ్వం న్యూస్) : విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా, హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటలపాటు సాగిన భేటీలో పది కీలక అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించారు. సమస్యల పరిష్కారానికి మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ వేయాలని నిర్ణయించినట్టు సమాచారం.

ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా పరిష్కారాలు ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. పెండింగ్ సమస్యల పరిష్కారంపై రెండు రాష్ట్రాల సీఎంలు అధికారుల సూచనలు తీసుకున్నారు.
ఈక్రమంలోనే న్యాయపరమైన చిక్కులపై కూడా చర్చించారు. షెడ్యూల్ 10లోని అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగగా, నిర్ణీత వ్యవధిలో సమస్యలు పరిష్కరించుకోవాలనే ఏకాభిప్రాయానికి ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చినట్టు తెలిసింది.