బీఆర్ఎస్‌కు బై బై..?

  • కీలక సమావేశానికి ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డుమ్మా..!

హైదరాబాద్, జూలై 6 (విశ్వం న్యూస్) : తెలంగాణ భవన్ వేదికగా జరుగుతున్న బీఆర్ఎస్ కీలక సమావేశానికి పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతోంది. అసలే మరో ఆరుగురు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారనే వార్తల నేపథ్యంలో భేటీ జరగడం.

ఈ సమావేశానికి కొందరు ఎమ్మెల్యేలు రాకపోవడంతో ఏదో తేడా కొడుతోందనే అనుమానాలకు తావిచ్చినట్లయ్యింది. తొలిరోజు సమావేశానికి రాలేదు సరే.. రెండో రోజు కూడా హాజరుకాకపోవడంతో పార్టీ మార్పు పక్కా అనే వార్తలు గుప్పుమంటున్నాయి.

శనివారం జరిగన కౌన్సిల్ సమావేశానికి రాకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. కౌన్సిల్ భేటీకి ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, ప్రకాష్ గౌడ్, మహిపాల్ రెడ్డి డుమ్మా కొట్టారు. కౌన్సిల్ భేటీకి కచ్చితంగా హాజరుకావాలని అధిష్ఠానం నుంచి ఎమ్మెల్యేలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ హాజరుకాకపోవడం గమనార్హం. దీంతో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఏమయ్యారు..? బీఆర్ఎస్‌కు బై బై చెప్పడానికి రంగం సిద్ధం చేసుకున్నారా..? లేకుంటే మరేదైనా కారణాలతో డుమ్మా కొట్టారా అనేది తెలియట్లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *