రేవంత్ రెడ్డి ఈ చిల్లర నిర్ణయాలను విరమించుకోవాలి:దాసోజు శ్రవణ్

హైదరాబాద్, నవంబర్ 30 (విశ్వం న్యూస్) : రేవంత్ రెడ్డి తెలంగాణపై విషం చిమ్ముతూ, నెగటివ్ మైండ్‌సెట్‌తో పాలన సాగిస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు విషయమై ఆయనకు సరైన అవగాహన లేదని తేలింది. తెలంగాణ తల్లి రూపం అంటే ఒక్క విగ్రహం కాదు, అది ఉద్యమ ఆత్మ ప్రతిబింబం. 2006లో కేసీఆర్ ఎంపీ, కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేసినప్పుడు, తెలంగాణ తల్లి రూపకల్పనపై ప్రత్యేకంగా చర్చించి, అది తెలంగాణ ఆత్మను ప్రతిబింబించేలా రూపొందించారు.

రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని విద్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన తీరు శాడిస్టు, సైకోపాత్‌లా ఉందని విమర్శించారు. తెలంగాణ విగ్రహ మార్పు అనేది తెలంగాణ వ్యతిరేక శక్తులకు కొమ్ము కట్టడమే. విగ్రహ మార్పు అనేది తెలంగాణ ఉద్యమ చరిత్రకు తూట్లు పొడిచే ప్రయత్నం. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అశోక చిహ్నంలోని సింహాల రూపాన్ని మార్చినప్పుడు రాహుల్ గాంధీ వ్యతిరేకించారు. అదే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడానికి కూడా కాంగ్రెస్ నేతలు స్పందించాలి. రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం తన తాత జాగీర్ అన్నట్టుగా ఉంది.

తెలంగాణ ఉద్యమ చరిత్రలో రేవంత్ ఎప్పుడూ పాల్గొనకపోవడం వల్లే ఆయనకు దీనిపై అవగాహన లేదు. రేవంత్ రెడ్డికి ఈ పాప ప్రయత్నం తప్పదని హెచ్చరించారు. చరిత్రను అపహాస్యం చేయడం నిప్పుతో ఆడినట్టే. రేవంత్ రెడ్డి ఈ చిల్లర నిర్ణయాలను విరమించుకోవాలి. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు వంటి ఏకపక్ష నిర్ణయాలను ప్రజలు సహించరు. తెలంగాణ మేధావులు, కాంగ్రెస్ నేతలు రేవంత్ నిర్ణయాలపై స్పష్టంగా స్పందించాలి.

తెలంగాణ తల్లి రూపానికి ఏకపక్షంగా మార్పులు చేయాలని చూసే ఈ చర్యలు ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తాయి. చరిత్ర, సంస్కృతి, ఆత్మ గౌరవాన్ని కాపాడడం ప్రభుత్వాధినేతల బాధ్యత. తెలంగాణ తల్లి, బతుకమ్మ, ధూమ్ ధామ్ వంటి ప్రతీకలు ఉద్యమ ఆత్మ ప్రతిబింబాలు, వాటి పరిరక్షణకు ప్రజలందరూ మద్దతుగా నిలవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *