చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేటీఆర్

- మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి ప్రత్యేక పూజలు
హైదరాబాద్: బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చార్మినార్ వద్ద కొలువైన భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి ఆలయానికి చేరుకున్న కేటీఆర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. వారి రాకతో చార్మినార్ పరిసరాల్లో బీఆర్‌ఎస్ కార్యకర్తలు, అభిమానులు సందడి చేశారు.