
రఘునందన్ బేషరతుగా బాపు కేసిఆర్ కి క్షమాపణ చెప్పాలి:మంత్రి శ్రీదేవి
హైదరాబాద్, ఫిబ్రవరి 9 (విశ్వం న్యూస్) : ఆరుదశాబ్దాలపాటు తెలంగాణ గడ్డపై నెలకొన్న చీకట్లను చీల్చి వెలుగుదారులు పరిచిన దార్శనికుడు బాపు కేసిఆర్. కాలికి బలపం కట్టుకొని దేశమంతా తిరిగి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను ఎలుగెత్తిచాటిన జననేత మా బాపు కేసిఆర్.
ఉక్కుసంకల్పంతో దేశములో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి తెలంగాణను సాధించిన చారిత్రక పురుషుడు బాపూ కేసిఆర్. తెలంగాణ సమాజమంతా కన్నతండ్రిలా కొలిచే బాపు కేసిఆర్ పై రఘునందన్ రావు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. బాపు కేసిఆర్ ని పిట్టలదొర అని అవమానిస్తున్న రఘునందన్ జీవిత చరిత్రంతా నీచాతినీచం…..
నల్లదండు ముఠా నాయకుడు నయీం విసర్జించిన నెత్తుటిమలం తిన్న రఘునందన్ రావుకు బాపు కేసిఆర్ ని విమర్శించే అర్హతలేదు.
ఇతడొక కుహనా హిందుత్వవాది.
ఇతడు చెప్పేదంతా ఫేక్ హిందుత్వం.
కాసులకోసం న్యాయాన్ని విపణివీదిలో విక్రయిస్తాడు.
న్యాయవాది ముసుగులో ఉన్న అన్యాయవాది.
హిందూవాదినని చెబుతూ ఒవైసీ సోదరులను పొద్దున లేస్తే దుమ్మెత్తిపోస్తూ వాళ్ళతరుపున, నయీం తరుపున వాదిస్తాడు…..
ప్రశ్నిస్తే ఇది నా వృత్తి అని తన పెద్దనోరుతో దబాయిస్తాడు.
అన్ని హామీలను తుంగలోతొక్కి ప్రజలను మోసంచేస్తున్న అధికార పక్షాన్ని పల్లెత్తుమాట అనకుండా ప్రతిసారి కేసిఆర్ గారినీ, రామన్న,హరీషన్నలను,కవితక్కను విమర్శించే రఘునందన్ కుట్రలను ఎండగడుదాం…….
రఘునందన్ బేషరతుగా బాపు కేసిఆర్ కి క్షమాపణ చెప్పాలి.
లేదంటే గులాబీ మహిళాదండు రఘునందన్ కి తగిన బుద్ది చెబుతుంది……