
హైదరాబాద్, ఫిబ్రవరి 9 (విశ్వం న్యూస్) : చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సీఎం రంగరాజన్ మీద దాడి జరిగింది. ఇక్ష్వాకు వంశస్థుల పేరుతో సుమారు 20 మంది వరకు రంగరాజన్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. రాజరాజ్య స్థాపన పేరుతో.. వీర రాఘవ రెడ్డి అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి రంగరాజన్ ఇంట్లోకి చొరబడి హంగామా సృష్టించారు. నల్లరంగు దుస్తులు ధరించి ప్రైవేటు సైన్యాన్ని తలపించేలా వచ్చిన గుంపు.. చిలుకూరు బాలాజీ ఆలయం సమీపంలో ఉన్న రంగరాజన్ ఇంట్లోకి చొరబడ్డారు.
రంగరాజన్‌ను కింద కూర్చోబెట్టి.. వీరరాఘవ రెడ్డి అనే వ్యక్తి ప్రశ్నలు సంధిస్తూ, ఏమి తెలియదని, పురోహితుని రూపంలో ఉన్న కపట వేషధారి అంటూ దూషించాడు. తాము రామరాజ్య స్థాపన కోసం పోరాడుతున్నామని, తమకు సహకరించాలని బెదిరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.