రాజనీతి శాస్త్రం – బాపూ కేసీఆర్ సవ్యసాచిత్వం

హైదరాబాద్, సెప్టెంబర్ 13 (విశ్వం న్యూస్):
రాజనీతి శాస్త్రం అనేది సామాజిక శాస్త్రాల్లో ఒక ప్రధాన విభాగం. రాజ్యం, రాజ్యాంగం, ప్రభుత్వం, విధానాలు, పరిపాలన, ప్రజా వ్యవస్థలు, సిద్ధాంతాలు, భావజాలాలు వంటి అంశాలను లోతుగా విశ్లేషించే శాస్త్రం అదే రాజనీతి శాస్త్రం. స్థానికం నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడం కూడా ఈ పరిధిలో భాగమే. ఈ మొత్తం ప్రక్రియను సమకాలీన సమాజంలో “రాజకీయం” అనే పదంలో ప్రతిబింబింపజేస్తారు.
సాధారణంగా ప్రజల దృష్టిలో రాజకీయం అంటే చాకచక్యం, చతురత, లాభనష్టాల గమనిక. మరోవైపు నిష్కాపట్యం, నైతికతలకు కంటే ప్రయోజనకర అంశాలకు ప్రాధాన్యం ఇచ్చే ఆచరణ. ఈ రెండు విధానాలూ ఆధునిక రాజకీయ రంగంలో కలిసిపోతున్నాయి.

ఇలాంటి సందర్భంలో రాజనీతి శాస్త్రాన్ని లోతుగా అధ్యయనం చేసి, పరిపాలనలో సంస్కరణలు అమలు చేసి, రాజకీయ చతురతను సమయానుకూలంగా వినియోగించి, ప్రత్యర్థులను ఎదుర్కొంటూ దశాబ్దకాలం పాటు ప్రజాసేవ సాగించిన నాయకుడు బాపూ కేసీఆర్ అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
తెలుగు భాషపై మక్కువ, రాజ్యాంగంపై నిబద్ధత, రైతాంగం–కార్మిక వర్గాల పట్ల చిత్తశుద్ధి, పరిపాలనా సౌలభ్యం, సమాజ పట్ల స్పృహ – ఇవన్నీ కలగలిసి ఆయన రూపంలో మూర్తీభవించాయని మేధావులు విశ్లేషిస్తున్నారు.
రైతాంగానికి మేలు చేసే విధానాలు, కార్మిక వర్గాల కోసం సంక్షేమ నిర్ణయాలు, పరిపాలనలో ప్రవేశపెట్టిన నూతనత – ఇవన్నీ బాపూ కేసీఆర్ పాలనను ప్రత్యేకంగా నిలబెట్టాయి. అందుకే ఆయన పాలనను ప్రజలు స్వర్ణయుగంగా వర్ణిస్తూ, మరోసారి అదే దశాబ్ధం పునరావృతం కావాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
“కోట్లు మంది ప్రజలు బాపూ కేసీఆర్ తిరిగి రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నారు. ఆయన స్థానాన్ని ప్రజా మనసుల్లో మరెవ్వరూ భర్తీ చేయలేరు” అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
👉 ప్రజా మనసుల్లో అపూర్వ నాయకత్వం – బాపూ కేసీఆర్
