నాగారం బంగ్లాలో కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు

నాగారం బంగ్లాలో కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు

  • సర్పంచ్‌గా బయ్యం సుజాత వెంకన్నను ఏకగ్రీవంగా తీర్మానించిన గ్రామ శాఖ

నాగారం, నవంబర్ 26 (విశ్వం న్యూస్): నాగారం మండలం పరిధిలోని నాగారం బంగ్లా గ్రామంలో సర్పంచ్ పదవికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖరారైంది. బయ్యం సుజాత వెంకన్నను అధికారికంగా సర్పంచ్ అభ్యర్థిగా బలం పర్చినట్లు గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు కొండ్రెడ్డి మోహన్ రెడ్డి ప్రకటించారు.

బుధవారం గ్రామంలోని ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఈ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. గ్రామ శాఖ సమన్వయంతో జరిగిన ఈ సమావేశంలో పార్టీ గెలుపు కోసం ప్రతి నాయకుడు, కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.

కార్యకర్తలు ఏకం – లక్ష్యం కాంగ్రెస్ గెలుపు
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన — “సుజాత వెంకన్న గెలుపు మాత్రమే కాదు, నాగారం బంగ్లా అభివృద్ధి కూడా మన లక్ష్యం. ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేస్తే కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుంది” అన్నారు.

కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు కన్నెబోయిన రామ్మూర్తి, ముకుంద రెడ్డి, లింగారెడ్డి, కన్నెబోయిన అంజయ్య, యాకూబ్, వీరన్న, యాదగిరి, వెంకన్న, ఉప్పలయ్య, నాగరాజు, భార్గవ్ తదితరులు పాల్గొని అభ్యర్థికి తమ మద్దతును ప్రకటించారు.

గ్రామంలో ఇప్పటికే ఎన్నికల జోరు మొదలై ఉండగా, కాంగ్రెస్ అభ్యర్థి ఖరారవడంతో పోటీ మరింత హోరాహోరీగా మారే అవకాశాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *