ఆరుగురు పేకాటరాయులు అరెస్టు

నాగారం, నవంబర్ 28 (విశ్వం న్యూస్): నాగారం మండలంలోని ఫణిగిరి గుట్ట పరిసర ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ చిరంజీవి తెలిపారు.
శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అసాంఘిక కార్యకలాపాలను అణచివేయడంలో పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. మధ్యాహ్నం సమయంలో లభించిన నమ్మదగిన సమాచారం ఆధారంగా సిబ్బందితో కలిసి దాడి చేసి పేకాటరాయులను పట్టుకున్నట్లు వివరించారు.
వారి వద్ద నుంచి ₹24,400 నగదు, నాలుగు ద్విచక్రవాహనాలు, ఐదు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసినట్లు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాల చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు.