ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలెక్షన్లకు కాంగ్రెస్ తూట్లు: డా. దాసోజు శ్రవణ్

ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలెక్షన్లకు కాంగ్రెస్ తూట్లు: డా. దాసోజు శ్రవణ్

హైదరాబాద్, ఫిబ్రవరి 7, 2026 (విశ్వం న్యూస్) : రాష్ట్రంలో ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలెక్షన్లు జరగాల్సిన పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ఒక రౌడీ రాజ్యంగా మారిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతో, ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో పార్టీ శ్రేణులు దాడులు, బెదిరింపులకు పాల్పడుతూ భూతపురాణాలతో రెచ్చిపోతున్నాయని ఆయన ఆరోపించారు.

కనీస రాజకీయ సంస్కారం లేకుండా మాజీ మంత్రి మల్లారెడ్డి గారిపై దాడికి ప్రయత్నించడం అత్యంత దుర్మార్గమని పేర్కొన్నారు. అలాగే క్యాతనెపల్లి మున్సిపాలిటీలో మాజీ మంత్రి హరీశ్ రావు గారిపైనా దాడి యత్నం జరగడం కాంగ్రెస్ పార్టీ గుండాగిరి రాజకీయాలకు నిదర్శనమని అన్నారు.

రాజ్యాంగాన్ని కాపాడాల్సిన స్పీకర్ నియోజకవర్గంలోనే బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఇనానిమస్‌గా ఎన్నికైన అభ్యర్థులను బెదిరించడం, బలవంతంగా బుర్కాలు కప్పించి లోపలికి తీసుకెళ్లి విత్‌డ్రా చేయించడం ప్రజాస్వామ్యానికి అవమానమని డా. శ్రవణ్ వ్యాఖ్యానించారు. కోడంగల్‌లో కూడా ఇదే తరహా రౌడీయిజం కొనసాగిందని విమర్శించారు.

బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు స్వేచ్ఛగా ప్రచారం చేసుకోకుండా అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలెక్షన్లకు తూట్లు పొడుస్తోందని, పోలీసులను పూర్తిగా రాజకీయ తొత్తులుగా మార్చిందని ఆయన ఆరోపించారు.

ఈ నేపథ్యంలో మాజీ మంత్రి మల్లారెడ్డి గారి నేతృత్వంలో, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శంభీపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ నేతృత్వంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశామని తెలిపారు. దీనిపై ఎన్నికల కమిషనర్ సానుకూలంగా స్పందించి సంబంధిత ఏసీపీ, సీఐలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని చెప్పారు.

ప్రభుత్వ హామీలను అమలు చేయలేక రౌడీయిజం, గుండాగిరిని అడ్డంపెట్టుకుని ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని డా. దాసోజు శ్రవణ్ ఆరోపించారు. అయితే ప్రజలు ఇప్పటికే స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారని, ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజాస్వామ్యబద్ధంగా తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *