హైదర్షాకోట్లో శ్రీ రామలింగేశ్వర స్వామి 12వ వార్షికోత్సవం

హైదరాబాద్, ఫిబ్రవరి 8, 2026 (విశ్వం న్యూస్) : రాజేంద్రనగర్ నియోజకవర్గం, GHMC 123వ డివిజన్ పరిధిలోని హైదర్షాకోట్ వెస్ట్రన్ కాలనీలో శ్రీ రామలింగేశ్వర స్వామి 12వ వార్షికోత్సవం పూజలు శ్రద్ధాభక్తులతో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పూలపల్లి కృష్ణారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ లీడర్ సంజీవరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేత పాపి రెడ్డి హాజరయ్యారు. అలాగే వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తలారి ప్రేమ్ కుమార్, ఏ-బ్లాక్ అధ్యక్షులు డప్పు నవీన్ కుమార్, బీసీ సెల్ అధ్యక్షులు అంకం శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ భోగాల శ్రీనివాస్‌తో పాటు దేవాలయ కమిటీ సభ్యులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా, స్వామివారి ఆశీస్సులు ప్రజలందరికీ కలగాలని నాయకులు ప్రార్థించారు. ఆలయ అభివృద్ధికి తమవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.