మెగాస్టార్ చిరంజీవికి
‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డు’

- ఉగాది రోజున ఘనంగా
అవార్డుల ప్రదానం
హైదరాబాద్, మార్చి 7 (విశ్వం న్యూస్) : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ – 2026 వివరాలను అధికారికంగా ప్రకటించింది. గతంలో ఉన్న నంది అవార్డులకు బదులుగా ప్రారంభించిన ఈ అవార్డులు సినీ రంగానికి కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. దాదాపు దశాబ్దం పాటు ప్రభుత్వ గుర్తింపు లేకుండా ఉన్న సినీ రంగానికి ఈ అవార్డులు ప్రోత్సాహంగా నిలుస్తున్నాయని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ఏడాది అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్టాత్మకమైన ‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డు’ ఇవ్వాలని నిర్ణయించారు. ప్రముఖ నటుడు కమల్ హాసన్కు పైడి జయరాజ్ అవార్డు, ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్కు నాగిరెడ్డి – చక్రపాణి అవార్డు, ప్రముఖ నటి జయసుధకు ఏఎన్ఆర్ అవార్డు ప్రకటించారు.

ప్రఖ్యాత నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ఆధ్వర్యంలో పనిచేసిన జ్యూరీ కమిటీ ఈ ఏడాది అవార్డుల రెండో దశ విజేతలను ప్రకటించింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని మార్చి 19 ఉగాది రోజున ఘనంగా నిర్వహించనున్నారు. సినీ రంగానికి చెందిన ప్రముఖులు, కళాకారులు, సాంకేతిక నిపుణులు ఈ వేడుకలో పాల్గొననున్నారు.
ప్రత్యేక అవార్డులు
ఎన్టీఆర్ నేషనల్ అవార్డు – చిరంజీవి
పైడి జయరాజ్ అవార్డు – కమల్ హాసన్
నాగిరెడ్డి – చక్రపాణి అవార్డు – అశ్వినీ దత్
ఏఎన్ఆర్ అవార్డు – జయసుధ
ఫీచర్ ఫిల్మ్ అవార్డులు
ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్ రాంబాయి
ద్వితీయ ఉత్తమ చిత్రం – దండోరా
తృతీయ ఉత్తమ చిత్రం – ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో
ఉత్తమ నటుడు – నాగ చైతన్య (తండేల్)
ఉత్తమ నటి – రష్మిక (ది గర్ల్ ఫ్రెండ్)
ఉత్తమ దర్శకుడు – సాయిలా (రాజు వెడ్స్ రాంబాయి)
జాతీయ సమైక్యతపై ఉత్తమ చిత్రం – తండేల్
సామాజిక సందేశంతో ఉత్తమ చిత్రం – కోర్ట్
ఉత్తమ డాక్యుమెంటరీ – యూనిటీ
ఉత్తమ ప్రజాదరణ చిత్రం – సంక్రాంతికి సౌరనం
ఉత్తమ తొలి దర్శకుడు –
సాయి మార్తాండ్ (లిటిల్ హార్ట్స్)
ఉత్తమ బాలల చిత్రం – అనగనగా
నటన విభాగం
ఉత్తమ సహాయ నటుడు – శివాజీ (దండోరా)
ఉత్తమ సహాయ నటి – భూమిక (యుఫోరియా)
ఉత్తమ బాల నటుడు –
మాస్టర్ రోహన్ (ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో)
సంగీతం – సాంకేతిక విభాగాలు
ఉత్తమ సంగీత దర్శకుడు –
మార్క్ రాబిన్ (దండోరా)
ఉత్తమ గాయకుడు – అనురాగ్ కులకర్ణి
(రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ గాయని – సాహితి (కన్నప్ప)
ఉత్తమ కథా రచయిత – గుణశేఖర్ (యుఫోరియా)
ఉత్తమ స్క్రీన్ ప్లే –
అనిల్ రావిపూడి (సంక్రాంతికి సమరాం)
ఉత్తమ గీత రచయిత – నందకిశోర్ (కుబేర)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ –
కార్తిక్ ఘట్టమనేని (మిరాయి)
ఉత్తమ ఎడిటర్ – శ్రీకర్ ప్రసాద్ (మిరాయి)
ఉత్తమ ఆడియోగ్రాఫర్ – ఎం.ఆర్. రాధాకృష్ణన్ (కిష్కిందాపురి)
ఉత్తమ నృత్య దర్శకుడు – సందీప్ (చాంపియన్)
ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ – తోటవర్ణి (చాంపియన్)
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ – గోవిందరాజు (అఖండ)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ –
చంద్రకాంత్ (రాంపియన్)
ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ –
పీటర్ (చాంపియన్)
ప్రత్యేక అవార్డులు
శ్రీరాజ్ రాచకొండ (23 ఫిలిమ్స్)
చైతు జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి)
రోషన్ మేకా (చాంపియన్)
అనంతిక (8 వసంతాలు)
ఈ అవార్డుల ప్రకటనతో తెలుగు సినీ పరిశ్రమలో ఆనందం నెలకొంది. ముఖ్యంగా చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఇవ్వడం సినీ ప్రపంచం నుండి విస్తృతంగా ప్రశంసలు అందుకుంటోంది.
ఉగాది రోజున జరిగే ఈ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొని తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపనున్నారు.