తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌ నియామకం

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌ నియామకం

  • ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ (డీజీపీ)గా C V Anand నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం హోం శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సీవీ ఆనంద్‌కు రాష్ట్ర పోలీస్‌ శాఖ అత్యున్నత పదవి అప్పగించింది.

అనుభవజ్ఞుడైన అధికారి : 1991 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన సీవీ ఆనంద్‌ గతంలో హైదరాబాద్‌ నగర పోలీస్ కమిషనర్‌గా, సైబరాబాద్‌ కమిషనర్‌గా, ఏసీబీ డీజీగా కీలక పదవుల్లో సేవలందించారు. నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా సమర్థవంతంగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *