మున్సిపల్ టాక్స్ బకాయిల చెక్కు అందజేత

మున్సిపల్ టాక్స్ బకాయిల చెక్కు అందజేత

హుజూరాబాద్, ఏప్రిల్ 28 (విశ్వం న్యూస్) : హుజూరాబాద్ పట్టణంలోని జామే మసీద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న న్యూ ఉస్మాన్ సెట్ షాపింగ్ కాంప్లెక్స్, ఓల్డ్ షాపింగ్ కాంప్లెక్స్‌కు సంబంధించిన మున్సిపల్ టాక్స్ బకాయిలుగా రూ.3,65,300 చెక్కును కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మున్సిపల్ చైర్‌పర్సన్ రెంటాల సుహాసిని, కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్లకు అందజేశారు.

మంగళవారం జామే మసీద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మేనేజర్ భూపాల్ రెడ్డి, ఆర్‌ఐ రమేష్, కమిటీ నాయకులు మహమ్మద్ హబీబ్, రఫీ మున్ను, మహమ్మద్ ఇర్ఫాన్, మహమ్మద్ హర్షద్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ, మే 28న జరగనున్న బక్రీద్ సందర్భంగా ఈద్గా ఆవరణంలో గత రంజాన్ మాదిరిగానే అన్ని సౌకర్యాలు కల్పించాలని మున్సిపల్ అధికారులను కోరారు.

దీనికి స్పందించిన చైర్‌పర్సన్ రెంటాల సుహాసిని, కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్ మాట్లాడుతూ బక్రీద్ పండుగ సందర్భంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపడతామని హామీ ఇచ్చారు.

అదేవిధంగా నూతన మున్సిపల్ పాలకవర్గం తమ పనులకు సహకరించాలని కమిటీ అధ్యక్షులు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *