తమిళనాడులో టీవీకే ప్రభంజనం

తమిళనాడులో
టీవీకే ప్రభంజనం

తమిళనాడు, మే 4 (విశ్వం న్యూస్) : తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు తిరుగుతోంది. నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ మ్యాజిక్ ఫిగర్‌కు చేరువలో నిలిచి అధికారానికి బలంగా దూసుకెళ్తోంది. రాష్ట్రవ్యాప్తంగా టీవీకే ప్రభంజనం కొనసాగుతుండగా, చెన్నై నగరాన్ని మినహాయించి దాదాపు అన్ని ప్రాంతాల్లో పార్టీ ఆధిక్యం ప్రదర్శిస్తోంది.

ప్రస్తుతం వస్తున్న ట్రెండ్స్ ప్రకారం, టీవీకేకు స్పష్టమైన మెజారిటీకి కొద్దిపాటి సీట్లు మాత్రమే అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, సీపీఐ, పీఎంకే పార్టీల మద్దతు కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా లెక్కల ప్రకారం పీఎంకే 6, కాంగ్రెస్ 5, సీపీఐ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. సాయంత్రానికల్లా ఈ పార్టీలతో కొత్త ఈక్వేషన్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇప్పటికే తమిళనాడు వ్యాప్తంగా టీవీకే శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. విజయ్ ముఖ్యమంత్రి అవుతారనే నమ్మకంతో పార్టీ కార్యకర్తలు ఆనందోత్సాహాలతో ముందుకెళ్తున్నారు. మరోవైపు, అన్నాడీఎంకేతో పవర్ షేరింగ్‌కు విజయ్ విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

ఇక ముఖ్యమంత్రి స్టాలిన్ పోటీ చేస్తున్న కొళత్తూరు నియోజకవర్గంలో అనూహ్యంగా వెనుకంజలో ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మొత్తం మీద తమిళనాడు రాజకీయాల్లో టీవీకే కొత్త శక్తిగా ఎదుగుతూ, సీఎం పీఠంపై విజయ్ ఆశలు బలపడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *