ఉద్యమ యోధుడికి అశ్రునివాళి

విశ్వం న్యూస్/తిమ్మాపూర్, మే 12: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, బీజేపీ సీనియర్ నాయకుడు ఎడ్ల జోగిరెడ్డి(61) మృతికి ప్రాంతవ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. గత సోమవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.
మంగళవారం స్వగ్రామమైన తిమ్మాపూర్‌లో ఆయన భౌతికకాయాన్ని సందర్శించిన ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు ఘన నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన అంతిమయాత్రలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జి.వి. రామకృష్ణారావు, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు ఓరుగంటి ఆనంద్, కనకం కుమారస్వామి, సర్పంచ్ గంకిడి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తెలంగాణ ఉద్యమకారులు పెద్ద ఎత్తున హాజరై జోగిరెడ్డి సేవలను స్మరించుకున్నారు.