రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ అంశంపై రేవంత్ చిల్లర రాజకీయాలు: దాసోజు

హైదరాబాద్, జూన్ 5 (విశ్వం న్యూస్) : రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ అంశంలో బీజేపీని ప్రశ్నించకుండా కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకోవడం సీఎం రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలకు నిదర్శనమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ విమర్శించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌కు కేంద్ర ప్రభుత్వం పీఎల్ఐ పథకం కింద గుర్తింపు ఇచ్చిందని, ఎల్ఐసీ ద్వారా పెట్టుబడులకు కూడా అనుమతులు లభించాయని గుర్తుచేశారు.

కేటీఆర్ హయాంలో కంపెనీతో కేవలం ఎంఓయూ మాత్రమే కుదిరిందని, రాష్ట్ర ఖజానా నుంచి ఎలాంటి నిధులు లేదా భూములు కేటాయించలేదని స్పష్టం చేశారు. పెట్టుబడులు తీసుకురావడంలో విఫలమైన రేవంత్ రెడ్డి తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. TS-iPASS డాష్‌బోర్డ్‌ను నిలిపివేయడం ద్వారా పారదర్శకతను దెబ్బతీశారని, ప్రభుత్వం పెట్టుబడులు, ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.