మంత్రి శ్రీధర్ బాబు మేనత్త
సువర్ణ వనమాల కన్నుమూత

మంథని, జూలై 20 (విశ్వం న్యూస్): పెద్దపల్లి జిల్లా మంథని మాజీ సర్పంచ్ సువర్ణ చంటయ్య సతీమణి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మేనత్త సువర్ణ వనమాల (91) సోమవారం కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు.
సువర్ణ వనమాల మరణ వార్తతో కుటుంబ సభ్యులు, బంధువులు, మంథని ప్రాంత ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమె అంతిమ యాత్ర జూలై 21 (మంగళవారం) ఉదయం 6 గంటలకు మంథనిలోని రావుల చెరువు కట్ట వద్ద ఉన్న స్వగృహం నుంచి ప్రారంభమై, గోదావరి తీరంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.