బాలికపై అత్యాచారం.. 84 ఏళ్ల వృద్ధుడికి 21 ఏళ్ల జైలు

హైదరాబాద్, జూన్ 20 (విశ్వం న్యూస్): 12 ఏళ్ల మానసిక వికలాంగ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన 84 ఏళ్ల వృద్ధుడికి రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు 21 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2023 మార్చిలో చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి వెంకటనారాయణ బాలికను చాక్లెట్లు ఇస్తానని మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
బాలిక తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేశారు. విచారణ అనంతరం కోర్టు నిందితుడికి 21 ఏళ్ల జైలు శిక్షతో పాటు బాధిత బాలికకు రూ.4 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. పిల్లలపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఈ తీర్పు స్పష్టం చేసింది.