మూడేళ్ల నిరీక్షణకు తెర.. క్లీంకార ఫేస్ రివీల్!

మూడేళ్ల నిరీక్షణకు తెర.. క్లీంకార ఫేస్ రివీల్!

హైదరాబాద్, జూన్ 20 (విశ్వం న్యూస్): మెగా అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న క్షణం ఎట్టకేలకు వచ్చింది. రామ్ చరణ్–ఉపాసన దంపతులు తమ కుమార్తె క్లీంకార ముఖాన్ని తొలిసారిగా అభిమానులకు చూపించారు. క్లీంకార మూడో పుట్టినరోజు సందర్భంగా ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫ్యామిలీ ఫొటో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు కూతురు గోప్యతను కాపాడిన ఈ జంట, బర్త్‌డే రోజున అభిమానులకు ప్రత్యేక కానుకగా ఆమె ఫేస్‌ను రివీల్ చేశారు.

పచ్చని ప్రకృతి మధ్యలో తీసిన ఆ ఫొటోలో రామ్ చరణ్, ఉపాసన తమ గారాల పట్టిని ప్రేమగా ఎత్తుకుని కనిపించారు. నీలిరంగు దుస్తుల్లో చిరునవ్వులు చిందిస్తున్న చిన్నారి క్లీంకార అమాయకత్వం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఫొటో బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ మొదలైంది. మెగా అభిమానులు, సినీ ప్రముఖులు క్లీంకారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుండగా, ఆమె ఫేస్ రివీల్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *