వాడెవడో… నాకు సంబంధం లేదు: ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్

వాడెవడో… నాకు సంబంధం లేదు: ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్

  • ప్రేమ వివాహానికి సిద్ధమైన కుమారుడు సంతోష్ గౌడ్ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్, ఆగస్టు 6 (విశ్వం న్యూస్): ప్రేమ వివాహం చేసుకునేందుకు సిద్ధమైన తన కుమారుడు సంతోష్ గౌడ్ వ్యవహారంపై రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా, సామాజికంగా చర్చనీయాంశంగా మారాయి.

మీడియా ప్రతినిధులు సంతోష్ గౌడ్ వ్యవహారం గురించి ప్రశ్నించగా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ స్పందిస్తూ, “వాడెవడో… నాకు సంబంధం లేదు. ఆ విషయం గురించి నేను మాట్లాడదలచుకోలేదు” అని స్పష్టం చేశారు.

అంతేకాక, “సమయం వచ్చినప్పుడు మాట్లాడుతా” అని వ్యాఖ్యానిస్తూ ప్రస్తుతం ఈ అంశంపై మరింత స్పందించేందుకు నిరాకరించారు.

ఇటీవల సంతోష్ గౌడ్ తన ప్రాణాలకు ముప్పు ఉందని, ప్రేమ వివాహానికి కుటుంబం నుంచి వ్యతిరేకత ఎదురవుతోందని చేసిన ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ చేసిన తాజా వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ప్రకాశ్ గౌడ్ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, సంతోష్ గౌడ్ తదుపరి స్పందనపై కూడా ఆసక్తి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *