దివ్యాంగులకు ‘లెట్స్ మేక్ చేంజ్’ చేయూత

దివ్యాంగులకు ‘లెట్స్ మేక్ చేంజ్’ చేయూత

దివ్యాంగులకు ‘లెట్స్ మేక్ చేంజ్’ చేయూత

దివ్యాంగులకు ‘లెట్స్ మేక్ చేంజ్’ చేయూత

దివ్యాంగులకు ‘లెట్స్ మేక్ చేంజ్’ చేయూత

దివ్యాంగులకు ‘లెట్స్ మేక్ చేంజ్’ చేయూత

సికింద్రాబాద్: దివ్యాంగులు, నిరుపేదలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ‘లెట్స్ మేక్ చేంజ్ కమ్యూనిటీ’ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని హోమ్ ఫర్ ది డిసేబుల్డ్–బైబిల్ హౌస్‌లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కమ్యూనిటీ కార్యనిర్వాహకులు జానకి రామ్, సభ్యులు, వాలంటీర్లు కార్యక్రమంలో పాల్గొని దివ్యాంగులకు అవసరమైన వస్తువులను అందజేశారు.

ఈ సందర్భంగా జానకి రామ్ మాట్లాడుతూ.. “మార్పు కోసం ఎదురుచూడకండి.. మనమే మార్పుకు శ్రీకారం చుట్టాలి” అనే సందేశంతో తమ కమ్యూనిటీ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ తమకు సాధ్యమైన విధంగా సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

సమాజంలోని వెనుకబడిన వర్గాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్న సహాయం కూడా అవసరంలో ఉన్నవారి జీవితాల్లో పెద్ద మార్పు తీసుకురాగలదని నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ‘లెట్స్ మేక్ చేంజ్ కమ్యూనిటీ’ సభ్యులు, వాలంటీర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *