దానం నాగేందర్‌పై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఫైర్‌

దానం నాగేందర్‌పై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఫైర్‌

చిల్లర రాజకీయాలతో ప్రజల్లో నాయకులపై గౌరవం పోతుంది

విశ్వo న్యూస్‌, హైదరాబాద్‌, ఆగస్టు 15: దానం నాగేందర్‌ లాంటి నాయకుల వ్యవహారశైలితో ప్రజల్లో రాజకీయ నాయకులపై ఉన్న గౌరవం దెబ్బతింటోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి, మళ్లీ తాను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు.

ఇది ఎలాంటి రాజకీయమో ప్రజలకు అర్థం కావడం లేదని, ఇలాంటి చిల్లర రాజకీయాలతో రాజకీయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుందని విమర్శించారు. దానం నాగేందర్‌ వ్యవహారంపై కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

రేవంత్‌రెడ్డి, మహేష్‌కుమార్‌గౌడ్‌ ఈ అంశాన్ని ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని రాజగోపాల్‌రెడ్డి కోరారు. పార్టీ ప్రయోజనాలతో పాటు ప్రజల్లో రాజకీయ నాయకత్వంపై ఉన్న విశ్వాసాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *