చిరు వ్యాపారులకు పెద్ద గొడుగుల పంపిణీ

చిరు వ్యాపారులకు పెద్ద గొడుగుల పంపిణీ

చిరు వ్యాపారులకు పెద్ద గొడుగుల పంపిణీ

చిరు వ్యాపారులకు పెద్ద గొడుగుల పంపిణీ

విశ్వం న్యూస్/కరీంనగర్, ఆగస్టు 16: కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని రాంనగర్ ప్రాంతంలో కూరగాయల చిరు వ్యాపారులకు ఎండ, వర్షం నుంచి రక్షణ కల్పించేందుకు అలయన్స్ క్లబ్ ఆఫ్ మానేరు, వాసు దేవా హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో పెద్ద గొడుగులను ఉచితంగా పంపిణీ చేశారు.

చిరు వ్యాపారులకు అనుకూలంగా ఉండేలా ప్రత్యేకంగా తయారు చేయించిన గొడుగులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా అలయన్స్ క్లబ్ ఆఫ్ మానేరు స్వదేశీ ఆర్గనైజేషన్ సేవా కార్యక్రమాలు, లక్ష్యాలను నిర్వాహకులు వివరించారు. మరో విడతలో నగరంలోని కట్టరాంపూర్, భగత్‌నగర్ ప్రాంతాల్లోని కూరగాయల వ్యాపారులకు కూడా గొడుగులను అందజేయనున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో గొడుగుల దాతలు డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్–వాసు దేవా హాస్పిటల్, బత్తిని శ్రీనివాస్-చార్టర్డ్ ప్రెసిడెంట్, అలయన్స్ క్లబ్ ఆఫ్ మానేరు, కొంజర్ల మహేష్, ఇంజనీర్ కోల అన్నారెడ్డి, సెక్రటరీ గుగ్గిల్ల సత్యం, ట్రెజరర్ కే. అంజిబాబు, వైస్ ప్రెసిడెంట్ అర్జిత్ సింగ్, పిఆర్ఓ కుదుజ్, రాజేశం, శ్రీకాంత్, శంకర్, శ్రీనివాస్, ఈద కుమార స్వామి, పులాల శ్యామ్, పండుగ నాగరాజు, సాగర్ రెడ్డి, ప్రసాద్, గాలిపెల్లి నాగేశ్వర్, చెరిమల వెంకటేశ్వర్లు, అల్లాడి ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *