ఐపీఎస్‌ పుల్ల కరుణాకర్‌కు ఘన సన్మానం

ఐపీఎస్‌ పుల్ల కరుణాకర్‌కు ఘన సన్మానం

ఐపీఎస్‌ పుల్ల కరుణాకర్‌కు ఘన సన్మానం

హుజూరాబాద్‌, సెప్టెంబర్‌ 8: ఐపీఎస్‌గా ఎంపికైన పుల్ల కరుణాకర్‌ను తెలంగాణ కమర్షియల్ టాక్సెస్ సర్వీసెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఘనంగా సన్మానించారు. మంగళవారం కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలో హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రెంటాల సుహాసిని మనోజ్‌రావు ఆధ్వర్యంలో పుల్ల కరుణాకర్ ఐపీఎస్ సెలక్షన్ సెలబ్రేషన్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ పుల్ల కరుణాకర్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సత్కరించారు. అనంతరం స్వీట్ తినిపించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జీ. భిక్షపతి, జగన్‌మోహన్‌రెడ్డి, మహమ్మద్ సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ.. పుల్ల కరుణాకర్ భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించి ఒకరోజు తెలంగాణ రాష్ట్ర డీజీపీగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రజల భద్రతకు పోలీస్ శాఖ ఎంతో కీలకమైందని, పుల్ల కరుణాకర్ ఐపీఎస్‌గా ఎంపిక కావడం అభినందనీయమన్నారు.

కార్యక్రమంలో పుల్ల కరుణాకర్ సతీమణి, తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ ఎస్. రజిని, వైద్య ఆరోగ్య శాఖ స్టాఫ్ నర్స్ ఇంద్రతో పాటు హుజూరాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వి. ప్రణవ్ బాబు, హుజూరాబాద్ ఏసీపీ మాధవి, సీఐ కరుణాకర్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *