భారీ మెజార్టీతో విజయం.. ఓటర్లకు కృతజ్ఞతలు
జామే మస్జిద్ అధ్యక్షుడిగా ముజాహిద్ హుస్సేన్

విశ్వం న్యూస్/హుజూరాబాద్, సెప్టెంబర్ 7: హుజూరాబాద్ పట్టణంలోని జామే మస్జిద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్‌మెంట్ కమిటీ నూతన అధ్యక్షుడిగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆదివారం జామే మస్జిద్ ఆవరణలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహించారు.

హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డులకు చెందిన ముస్లిం సోదరులు ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆధార్ కార్డు ఆధారంగా 18 ఏళ్లు నిండిన వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. అధ్యక్ష పదవికి ముగ్గురు, జనరల్ సెక్రెటరీ పదవికి ముగ్గురు పోటీ చేయగా, కార్యవర్గ సభ్యులుగా 12 మందిలో 8 మందిని ఎన్నుకునే విధంగా ఎన్నికలు నిర్వహించారు.

మొత్తం 733 ఓట్లు పోలవగా, అధ్యక్ష పదవికి పోటీ చేసిన మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్‌కు 465 ఓట్లు లభించాయి. ఇమ్రాన్‌కు 202 ఓట్లు, మహమ్మద్ నవాబ్ పాషాకు 56 ఓట్లు రాగా, 10 ఓట్లు తిరస్కరించబడ్డాయి. దీంతో ముజాహిద్ హుస్సేన్ భారీ మెజార్టీతో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
నూతన కార్యవర్గంలో ఉపాధ్యక్షుడిగా మహమ్మద్ అంజాద్ ఖాన్, జనరల్ సెక్రెటరీగా మహమ్మద్ అశ్వక్ అశ్షు, జాయింట్ సెక్రెటరీగా కాజా కలీముద్దీన్ అమీర్, కోశాధికారిగా మహమ్మద్ అస్మతుల్లా ఖాన్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా మహమ్మద్ హబీబ్, మహమ్మద్ ఫయాజుద్దీన్, మహమ్మద్ రియాసత్ అలీ, ఇర్షత్ మహమ్మద్ హుస్సేన్, మహమ్మద్ బాబా తాజుద్దీన్, ఇర్ఫాన్, మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ తదితరులు ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించిన ముస్లిం ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నూతన కార్యవర్గంతో కలిసి జామే మస్జిద్, ఈద్గా, కబ్రిస్తాన్ అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.