అసెంబ్లీ వద్ద పోలీసుల దురుసు ప్రవర్తనలో పలువురు బీఆర్ఎస్ నేతలకు గాయాలు
కేటీఆర్ సహా పలువురు నేతలకు గాయాలు

హైదరాబాద్, సెప్టెంబర్ 7: అసెంబ్లీ వద్ద చోటుచేసుకున్న పోలీసుల దురుసు ప్రవర్తనపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల చర్యల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే డా. సంజయ్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, యాదవ రెడ్డిలు గాయపడినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
గాయపడిన నేతలకు తెలంగాణ భవన్లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అసెంబ్లీ వద్ద ప్రజా సమస్యలపై నిరసన తెలిపేందుకు వచ్చిన ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్రంగా ఖండించదగినదని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.
ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపైనే పోలీసులు దాడులకు పాల్పడటం ఏమిటని ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలు.. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలకు తావులేదని అన్నారు.