మట్టి వినాయకులను పూజిద్దాం
మట్టి వినాయకులను పూజిద్దాం

విశ్వం న్యూస్/కరీంనగర్, సెప్టెంబర్ 13: పర్యావరణ పరిరక్షణలో భాగంగా కరీంనగర్‌లోని అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్, డిస్ట్రిక్ట్ 137ఏ ఆధ్వర్యంలో ఆదివారం భక్తులకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డా. ఎలగందుల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాల వల్ల నీరు, భూమి కలుషితమవడంతో పాటు పర్యావరణానికి హాని కలుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ పర్యావరణహితమైన మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో డా. ఎ. శ్రీనివాస్, ఇంజనీర్ కోలా అన్నారెడ్డి, జిల్లా గవర్నర్ కొంజర్ల మహేశ్, టి.వి.రావు, బండిపల్లి వెంకటరమణ, డా. చక్రవర్తుల రమణాచారి, డా. జి.ఎం. కిరణ్, డా. పురుషోత్తం, డా. అశోక్, డా. శ్రీనివాస్, డా. సౌమ్య, డా. సాయి మేఘన, డా. సాయి ప్రీతం, హుజురాబాద్ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ మనోజ్, ప్రసాద్, సాగర్ రెడ్డి, పులాల శామ్, నాగేశ్వర్, కుమారస్వామి, వెంకన్నతో పాటు వాసుదేవ హాస్పిటల్ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.