హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

  • ఆధ్యాత్మిక వేత్త శ్రీశ్రీశ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ

మోతీనగర్, అక్టోబర్ 8: హిందూ ధర్మ పరిరక్షణ, సనాతన సంప్రదాయాల ప్రచారం కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, అభయ హిందూ సేన వ్యవస్థాపకులు, ఆస్ట్రేలియా విక్టోరియా పార్లమెంటరీ ‘జీవిత సాఫల్య పురస్కారం’ గ్రహీత పరమ పూజ్య శ్రీశ్రీశ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీకి అభినందన సభ ఘనంగా నిర్వహించారు. ఆస్ట్రేలియాలో ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకుని భారతదేశానికి తిరిగి వచ్చిన సందర్భంగా బుధవారం సాయంత్రం మోతీనగర్‌లోని శంకర్‌మఠంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో హిందూ ధర్మం, సనాతన సంప్రదాయాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రతి ఒక్కరూ ధర్మం పట్ల చైతన్యంతో మెలగాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం స్వామీజీని ఘనంగా సన్మానించారు. చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నాట్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.

శ్రీశ్రీశ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ మాట్లాడుతూ.. ప్రతి ఇంట్లో తప్పనిసరిగా భగవద్గీత, రామాయణాలను పఠించేలా పిల్లలను, కుటుంబ సభ్యులను ప్రోత్సహించాలని సూచించారు. వీటిని చదవడం ద్వారా జ్ఞానం పెరగడంతో పాటు ఇంట్లో చక్కటి వాతావరణం ఏర్పడుతుందని, పెద్దలను గౌరవించడం వంటి మంచి విలువలు అలవడతాయని అన్నారు.

భగవద్గీత, రామాయణం మన మూలాలు, మన సంప్రదాయాలకు ప్రతీకలని, హిందూ ధర్మం ఎంతో గొప్పదని పేర్కొన్నారు. సనాతన ధర్మం గురించి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది తెలుసుకుంటున్నప్పటికీ, మన దేశంలో ఇంకా మూఢనమ్మకాల ప్రభావం కొనసాగడం బాధాకరమని అన్నారు. ప్రతి ఒక్కరూ మేల్కొని హిందూ ధర్మం గొప్పతనాన్ని, సనాతన సంప్రదాయాల విశిష్టతను సమాజానికి తెలియజేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా వెంకటేశ్వర్‌నగర్ కాలనీకి చెందిన దండుగల మల్లేష్ భగవద్గీతపై రూపొందించిన షార్ట్‌ఫిల్మ్‌కు కేవలం రెండు వారాల్లోనే సుమారు 5,800 వ్యూస్ వచ్చినందుకు స్వామీజీ అభినందించారు. అనంతరం షార్ట్‌ఫిల్మ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక వేత్తలు, ప్రవచనకర్తలు బెనరాస్ గురుజీ, వసంతలక్ష్మి, శిల్ప దీదీ, కరాటే కళ్యాణి, స్థానిక నాయకులు దండుగల మల్లేష్, రెడ్డిరాజు సునీల్, పసుపుల శివకుమార్, సి. సాయికుమార్ అడ్వకేట్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *