ఇసుక లారీ బీభత్సం.. ఇద్దరు CRPF జవాన్లు మృతి
ఇసుక లారీ బీభత్సం.. ఇద్దరు CRPF జవాన్లు మృతి

విశ్వం న్యూస్ / ములుగు, అక్టోబర్ 08: ములుగు జిల్లా పస్రా–తాడ్వాయి మధ్య అటవీ శాఖ చెక్పోస్ట్ సమీపంలో ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన లారీ రెండు వాహనాలను ఢీకొట్టింది.
ముందుగా CRPF జవాన్లు ప్రయాణిస్తున్న డీసీఎం వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. అక్కడ ఆగకుండా ముందుకు వెళ్లి రెవెన్యూ శాఖకు చెందిన కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు CRPF జవాన్లు మృతి చెందగా, ఇద్దరు రెవెన్యూ ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం అనంతరం పరారైన లారీ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.