సీరత్-ఉన్-నబీ పరీక్ష విజేతలకు బహుమతుల ప్రదానం

సీరత్-ఉన్-నబీ పరీక్ష విజేతలకు బహుమతుల ప్రదానం

విశ్వం న్యూస్/ హుజురాబాద్, అక్టోబర్ 10 : జమియత్ ఉలమా హుజురాబాద్ ఆధ్వర్యంలో సీరత్-ఉన్-నబీ పై నిర్వహించిన పరీక్షల్లో ప్రతిభ కనబరిచి ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సిటీ సెంటర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన జల్సా కార్యక్రమంలో విజేతలకు సూట్‌కేసులు, మెమొంటోలు, సర్టిఫికెట్లను ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమానికి జమియత్ ఉలమా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ముఫ్తీ యూనుస్ కాస్మి, ఉపాధ్యక్షులు ముఫ్తీ గియాస్ మొహియుద్దీన్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ సాదిక్ హుస్సేన్ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దైవభక్తిని, ఇస్లామిక్ విలువలను పెంపొందించడంతో పాటు ప్రవక్త ముహమ్మద్ ﷺ వారి జీవిత చరిత్రపై అవగాహన కల్పించేందుకు దోహదపడతాయని తెలిపారు. ధార్మిక విద్యను ప్రోత్సహిస్తూ, సత్ప్రవర్తనతో కూడిన సమాజ నిర్మాణానికి కృషి చేస్తున్న జమియత్ ఉలమా హుజురాబాద్ కమిటీ సభ్యులను అభినందించారు.

ఈ కార్యక్రమంలో జామే మస్జిద్ అండ్ ఈద్గా మేనేజ్‌మెంట్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్, జనరల్ సెక్రటరీ మహమ్మద్ అష్ఫాక్ (ఆషు), హుజురాబాద్ జమియత్ ఉలమా కమిటీ అధ్యక్షులు మీర్జా ఇమ్రాన్ బేగ్, జనరల్ సెక్రటరీ ముఫ్తీ షాకిర్, మసీదు కమిటీ సభ్యులు, జమియత్ ఉలమా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *