కుటుంబ కలహాలు.. తల్లి, ఇద్దరు పిల్లలు మృతి

కుటుంబ కలహాలు.. తల్లి, ఇద్దరు పిల్లలు మృతి
విశ్వం న్యూస్ / మహబూబాబాద్, అక్టోబర్ 10 : మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లింగ్యాతండా (బలపాల)లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో బానోత్ అనూష (35) తన ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకినట్లు సమాచారం.

ఈ ఘటనలో అనూషతో పాటు ఆమె కుమారుడు విశాల్ కృష్ణ (9), కుమార్తె వర్షిణి (5) మృతి చెందారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో లింగ్యాతండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.