ఇండియన్ రెడ్‌క్రాస్ నూతన కార్యవర్గానికి బండి సంజయ్ అభినందనలు

ఇండియన్ రెడ్‌క్రాస్ నూతన కార్యవర్గానికి బండి సంజయ్ అభినందనలు
విశ్వం న్యూస్ / కరీంనగర్, అక్టోబర్ 9: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కరీంనగర్ జిల్లా నూతన కార్యవర్గ సభ్యులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అభినందించారు. శుక్రవారం కరీంనగర్లో నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు కేంద్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు అందించాలని, మానవతా దృక్పథంతో సేవాభావంతో పనిచేస్తూ ప్రజలకు అండగా నిలవాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా ఆపదలో ఉన్నవారికి సహాయం అందించేలా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ సంగెం లక్ష్మణరావు, వైస్ చైర్మన్ ఉట్కూరి రాధాకృష్ణారెడ్డి, చీఫ్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ పెండ్యాల కేశవరెడ్డి, స్టేట్ ఈసీ సభ్యుడు కుందారపు మహేశ్వర్, కోశాధికారి గోనె శ్రీనివాస్, యూత్ కో-ఆర్డినేటర్ మొగలోజు రాకేష్, కార్యవర్గ సభ్యులు కోల అన్నారెడ్డి, పెద్ది విద్యాసాగర్, చిదుర సురేష్, పి. శ్రీహరిరెడ్డి, రాగి శ్రీనివాస్, సాయిని నరేందర్, హనుమాండ్ల రాజిరెడ్డి, కానపర్తి మనోహర్‌రావు, ఎలుగందల మునీందర్ పాల్గొన్నారు.
అలాగే ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు సర్దార్ హర్మీంధర్ సింగ్, టీఎన్జీవోల సంఘం కరీంనగర్ టౌన్ అధ్యక్షుడు మారుపాక రాజేష్ భరద్వాజ్, కార్యదర్శి వెలిచాల సుమంత్‌రావు తదితరులు పాల్గొన్నారు.