ఉద్యమకారుడి కుటుంబానికి కేటీఆర్ రూ.10 లక్షల సాయం

ఉద్యమకారుడి కుటుంబానికి కేటీఆర్ రూ.10 లక్షల సాయం

ఉద్యమకారుడి కుటుంబానికి
కేటీఆర్ రూ.10 లక్షల సాయం

విశ్వం న్యూస్/ మహబూబాబాద్, అక్టోబర్ 10 : తెలంగాణ ఉద్యమంలో మానుకోట ఘటన నుంచి చురుకైన పాత్ర పోషించిన ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. అనారోగ్యంతో జనార్ధన్ మృతి చెందడంతో, పేదరికంలో ఉన్న ఆయన కుటుంబం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. రోజువారీ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించిన జనార్ధన్‌కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

జనార్ధన్ కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న కేటీఆర్ మానవీయంగా స్పందించి మొత్తం రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించారు. ముగ్గురు కుమార్తెల భవిష్యత్తుకు భరోసాగా ఒక్కొక్కరి పేరిట రూ.3 లక్షల చొప్పున ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయించారు. కుటుంబ తక్షణ అవసరాల కోసం మరో రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు.

కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్ నేతలు: కేటీఆర్ ఆదేశాల మేరకు సీనియర్ నేతలు సత్యవతి రాథోడ్, రెడ్డ్యా నాయక్, మలోత్ కవితతో పాటు మహబూబాబాద్ జిల్లాకు చెందిన పలువురు బీఆర్‌ఎస్ నాయకులు జనార్ధన్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారిని ఓదార్చి, కేటీఆర్ అందించిన ఆర్థిక సాయాన్ని అందజేశారు.

తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉద్యమకారుడి కుటుంబానికి కష్టకాలంలో అండగా నిలవడం ద్వారా కేటీఆర్ తన మానవీయతను చాటుకున్నారు. ముగ్గురు ఆడబిడ్డల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ ఆర్థిక సాయం అందించిన కేటీఆర్‌కు కుటుంబ సభ్యులు, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *