Vishwam Newsకరీంనగర్

చిన్నారుల ఆరోగ్యానికి భరోసా.. శనిగరంలో పోలియో చుక్కల పంపిణీ!

  • ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన వైద్య సిబ్బంది

విశ్వం న్యూస్, హనుమకొండ: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం శనిగరం గ్రామంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం నిర్వహించారు. పోలియో మహమ్మారిని పూర్తిగా నివారించడంతో పాటు చిన్నారుల భవిష్యత్తుకు ఆరోగ్య భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా వైద్య సిబ్బంది గ్రామంలోని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పోలియో కేంద్రాలకు తీసుకువచ్చి చుక్కలు వేయించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేయించడం ద్వారా అంగవైకల్యానికి కారణమయ్యే పోలియో వ్యాధి నుంచి రక్షణ కల్పించవచ్చని వైద్య సిబ్బంది సూచించారు.

ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. గ్రామంలో పోలియో కార్యక్రమం నిర్వహించడంతో చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *