దళిత గిరిజన జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

దళిత గిరిజన జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

  • ఇండ్లు, ఇంటి స్థలాలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇవ్వాలి
  • ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టుల అధ్యక్షులు కట్కూరి మల్లేష్

పీర్జాదిగూడ, పిబ్రవరి 25 (విశ్వం న్యూస్) : రాష్ట్రంలో దళిత, గిరిజన జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి ఆదుకోవాలని తెలంగాణ ఎస్సీ ఎస్టీ, వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కట్కూరి మల్లేష్ డిమాండ్ చేశారు. శనివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మింట్ రెస్టారెంట్ లో తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, వర్కింగ్ అసోసియేషన్ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం కట్కూరి మల్లేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని జర్నలిస్టుల కోసం చేపట్టిన కార్యక్రమాల గురించి చర్చించారు. సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను రూపొందించారు. ఈ సందర్భంగా కట్కూరి మల్లేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ పత్రికల్లో మీడియా ఛానల్లో దళిత, గిరిజన జర్నలిస్టులు సంవత్సరాల తరబడి పని చేస్తున్నారని, అయినప్పటికీనీ వారికి ఆర్థికంగా స్తోమత లేక ఉపాధి లేక అభివృద్ధి జరగక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు.

రాష్ట్రంలో ఉన్న దళిత, గిరిజన జర్నలిస్టుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించి అభివృద్ధి అయ్యేలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దళితుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని దళిత జర్నలిస్టులకు ప్రత్యేకంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు దళిత గిరిజన జర్నలిస్టులకు ఇల్లు లేదా ఇంటి స్థలాలు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళిత, గిరిజన జర్నలిస్టుల కుటుంబాలకు వైద్య సంస్థల్లో ఫీజుల రాయితీ కల్పించాలని, దళిత గిరిజన జర్నలిస్టుల పిల్లలకు విద్యాసంస్థల్లో 100% రాయితీ కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ సమస్యలపై మార్చి నెలలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ఆందోళనలు నిర్వహించనున్నట్లుగా తెలిపారు. అందుకు రాష్ట్రంలోని దళిత గిరిజన జర్నలిస్టులు ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, వర్కింగ్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లేష్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర బందెల రాజశేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండ్ల కుమారస్వామి, కే గంగారం, దుర్గం నగేష్, సహాయ కార్యదర్శిలు పానుగంటి శ్రీనివాస్, లాలయ్య, కోశాధికారి ఆరేల్లి లక్ష్మీరాజం, రాష్ట్ర నాయకులు వీరన్న, సాయిలు బాలాజీ తదితరులు డ్రైవర్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *