సిసి రోడ్డు పనులను ప్రారంభం
ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్ యాదవ్
ములుగు, మార్చి 1 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేస్తుందని ములుగు ఎంపీపీ గంటకోట శ్రీదేవి సుధీర్ యాదవ్ లు అన్నారు. బుధవారం ములుగు జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో సిసి రోడ్ పనులను ఎంపీపీ శ్రీదేవి సుదీర్ యాదవులు ప్రారంభించారు . అనంతరం వారు మాట్లాడుతూ ములుగు జిల్లాను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరియు ఐటీ శాఖ మున్సిపల్ శాఖ మాత్యులు కేటి రామారావు, పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ములుగు జిల్లా ఇంచార్జి మంత్రి గిరిజన శిశు సంక్షేమ శాఖ మాత్యులు సత్యవతి రాథోడ్, ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి ములుగు పట్టణనికి 2కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేశారు. ఇంకా ములుగులోని అన్ని కాలనీలో త్వరలో పనులను ప్రారంభిస్తాం అని తెలిపారు. ములుగును అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ కో ఆప్షన్ మెంబర్ ఎండీ రియాజ్ మీర్జా, ఎంపీటీసీ గొర్రె సమ్మయ్య, మండల కో ఆప్షన్ మెంబర్ యూనుస్, బిఆర్ఎస్ పార్టీ మాజి పట్టణ అధ్యక్షులు మేర్గు సంతోష్, వార్డ్ మెంబర్ అజయ్ సుభాష్, అక్రమ్, హరీష్ ,షకీల్ మరియు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
