అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ ఆహారాన్ని అందజేసిన కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మీ శ్రీధర్ రెడ్డి

అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ ఆహారాన్ని అందజేసిన కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మీ శ్రీధర్ రెడ్డి

పీర్జాదిగూడ, మార్చి 28 (విశ్వం న్యూస్) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 13వ డివిజన్ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పోషణ పక్వాడ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తూముకుంట్ల ప్రసన్న లక్ష్మీ శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై గర్భిణీ స్త్రీలకు, చిన్న పిల్లలకు పోషకాహారాన్ని అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మీ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ పోషక ఆహారాలతో గర్భిణీ స్త్రీలకు, చిన్న పిల్లలకు ఎంతో ఎదుగుదల ఉంటుందని, ఈ పథకం ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంబంధిత మంత్రి అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాంతాబాయి, హేమలత, నాగమణి, రమాదేవి అంగన్వాడి కేంద్రం అధికారులు, డివిజన్ కాలనీ వాసులు,మహిళలు తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *