రంజాన్ సందర్భంగా సన్మానం

తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో
కరీంనగర్, మార్చి 28 (విశ్వం న్యూస్) : కరీంనగర్ ఉమ్మడి జిల్లాల వాణిజ్య పనుల శాఖ జాయింట్ కమిషనర్ వేణుగోపాలరావు, అసిస్టెంట్ కమిషనర్ గోవర్ధన్ పట్వారి, అసిస్టెంట్ కమిషనర్ మాధయ్యలకు తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ రంజాన్ ఉపవాసం సందర్భంగా అందరిని రుమాలీ టోపీ లతో పాటు శాలువాలతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాల టిసిటిఎన్జీవోస్ సంఘం అధ్యక్షుడు జి బిక్షపతిని ఈ సందర్భంగా సన్మానిచ్చారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర టి సి టి ఎన్జీవోస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ సంవత్సరంలో ముస్లిం సోదరులు 30 రోజులు ఉపవాసం ఉంటారు. సంవత్సరమంతా కష్టపడి సంపాదించిన సంపాదనలో నిరుపేదలకు సహాయం చేయడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నాయకులు మొహమ్మద్ అబ్దుల్ బారి మొహమ్మద్, సలావుద్దీన్ మహమ్మద్, నిజాముద్దీన్ మహమ్మద్ అహమ్మద్ హుస్సేన్, మహమ్మద్ ఇలియాస్ మహమ్మద్ అష్రఫ్, డిసి ఆఫీస్ మేనేజర్ శ్రీమతి శైలజ, నరసింహారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.