పేపర్ లీకేజీ : కమలాపూర్ హై స్కూల్లో పోలీస్ అధికారుల తనిఖీ

కమలాపూర్, ఏప్రిల్ 4 (విశ్వం న్యూస్) : ఎంతో పకడ్బందీగా నిర్వహించాల్సిన పదో తరగతి పరీక్షలు పేపర్ లీకేజీల పరంపర వివాదాస్పదంగా మారాయి. లీకేజీల నేపద్యములో మీడియాతో ఈ రోజు కమలాపూర్ మండల్ ఉప్పల్ గ్రామములో హిందీ ఎస్ఎస్సి పరీక్షా పేపర్ వాట్సాప్ ద్వారా బయటికి వంచిందని కొంత మంది పత్రిక మిత్రుల ద్వారా తెలిసింది. వెంటనే మేము హుటా హుటిన మేము మా సిఐ గారు, హాసనపర్తి సిఐ గారు, ఈ కమలాపూర్ సెంటర్ కి రావడం జరిగింది. సూపెర్డెంట్ మల్లయ్య గారిని, టీచర్స్ వారి ఫోన్స్ తనిఖీ చేయడం జరిగింది. మా పరిశోధనలో ఎటువంటి పేపర్ లీకేజి జరగలేదు. పేపర్ లీకేజీ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

