ప్రశ్నిస్తే కేసులు పెడతారా
వెంకట్ ఆక్రమ అరెస్ట్

వీణవంక, ఏప్రిల్ 4 (విశ్వం న్యూస్) : SSC పరీక్షలు మొదలైన రోజే తెలుగు పేపర్ 10 నిమిషాల ముందు వాట్సప్ లో లీక్ కావడంతో నిన్న అబిడ్స్ లోని ssc బోర్డుని ముట్టడింఛిన వారిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండి సాహెబ్ హుస్సేన్ తీవ్రంగా ఖండించారు.
ఒకవైపు TSPSC పేపర్స్ లీక్ వ్యవహారం ముగిసిపోక ముందే నిన్న మళ్ళీ వికారాబాద్ లో SSC పేపర్ లీక్ అయ్యింది, రాష్ట్రంలో ప్రతి పరీక్ష పేపర్ లీక్ అవ్వుతున్న ఇంత వరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలం కావడంతో ఈ ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు.
ప్రశ్నించే గొంతులను ఇలా అణచివేయడం ప్రజాస్వామ్యంలో ఒక చీకటి రోజుగా భావిస్తూ బిఆర్ఎస్ ప్రభుత్వం యువత జీవితాలతో చెలగాటం ఆడకుండా సుపరిపాలన అందించాలని లేనిపక్షంలో ప్రజల నుంచి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ఇప్పటికైనా ఈ లీకుల వ్యవహారం సిబిఐ చే విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చదువు జై పాల్, రెడ్డి ఈదునూరి పైడి కుమార్, ఎండి రజాక్, గిరవైన సాయిలు, తోడేటి రంజిత్, గుంపుల గట్టయ్య, ఎండి సలీం తదితరులు పాల్గొన్నారు.